Kaizer News

RS Praveen kumar | ఆ వ్యక్తి ఎవరో, గెస్ట్‌హౌస్‌ ఎక

RS Praveen kumar | ఆ వ్యక్తి ఎవరో, గెస్ట్‌హౌస్‌ ఎక్కడ ఉందో గుర్తించాలి..

· Business · prabhanews.com

RS Praveen kumar | ఆ వ్యక్తి ఎవరో, గెస్ట్‌హౌస్‌ ఎక్కడ ఉందో గుర్తించాలి.. రాష్ట్రాన్ని ‘ఎల్‌ కాంగో’ పట్టి పీడిస్తోంది అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు RS Praveen kumar | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అడ్వర్టైజింగ్‌ రంగంలో కాంట్రాక్ట్‌ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వాలని కోరిన ఓ మహిళా వ్యాపారవేత్తకు సీఎం సన్నిహితుడిగా చెప్పుకునే వ్యక్తి నుంచి అనుచిత ఆహ్వానం వచ్చిందంటూ చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. మహిళా వ్యాపారవేత్త చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ‘‘తాను ఎవరి పేర్లు చెప్పలేనని, ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరారు. ఆమె ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ అన్నారు. సీఎం సన్నిహితుడిగా పేర్కొంటున్న వ్యక్తి ఎవరో, గెస్ట్‌హౌస్‌ ఎక్కడ ఉందో గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సంబంధిత మహిళతో మాట్లాడి వాస్తవాలను బయటకు తీసుకురావాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. తెలంగాణ ఇప్పటికే మహిళలకు సంబంధించిన పలు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తుమ్మలూరులో రూ.300 కోట్ల విలువైన భూమి వ్యవహారంపై కూడా ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ.. ఈ అంశంపై పోరాటం చేస్తామని తెలిపారు. తుమ్మలూరు వెళ్లి బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలకు సంబంధించిన భూ వ్యవహారాల వివరాలను తమకు అందించాలని కోరారు. బీజేపీ నేత బండి సంజయ్‌పై కూడా ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ విమర్శలు చేశారు. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు లొంగిపోవాలని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన బండి సంజయ్‌పై న్యాయపరమైన అంశాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో రాజకీయాలు చేసే నైతిక అర్హత ఆయన కోల్పోయారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News