Kaizer News

బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.43 వేలు తగ్గింపు!

బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.43 వేలు తగ్గింపు!

· Business · sakshi.com

యాపిల్ తన ఐఫోన్ 18ను మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. ఐఫోన్ 17 కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ ఆఫర్, సూపర్‌కాయిన్ ప్రయోజనం, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌ వంటివి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో.. తెలుపు రంగు 'ఐఫోన్ 17' 256జీబీ వేరియంట్ ధర రూ. 99,900. అందుబాటులో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్, సూపర్‌కాయిన్ ప్రయోజనం,ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను ఉపయోగించడం ద్వారా దీనిని రూ. 55,283కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.43,717 తగ్గుతుందన్నమాట. ప్రయోజనాలు ఇలా.. ఈ ఆఫర్‌లో ప్రధానమైన ప్రయోజనం ఎక్స్చేంజ్ ఆఫర్. యాపిల్ ఐఫోన్ 15ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.41,700 తగ్గింపు లభించనుంది. ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరికీ తప్పకుండా రూ.41 వేలు ప్రయోజనం లభిస్తుందని అనుకోకూడదు. అదనంగా సూపర్‌కాయిన్ ప్రయోజనం కింద రూ.7, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ కింద 2,910 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాలు పొందిన తరువాత ఐఫోన్ 17 మొబైల్‌ను 55,283 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం 256జీబీ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. 512 జీబీ వేరియంట్ స్టాక్‌లో లేదని ప్రొడక్ట్ పేజీలో కనిపిస్తోంది. తెలుపు రంగు మొబైల్ మీద మాత్రమే మీకు ప్రయోజనాలు లభించినప్పటికీ.. ఇతర రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులకు సౌకర్యార్థం ఈఎంఐ ఎంపిక కూడా ఉంది. మూడు నెలల ఈఎంఐకి నెలకు సుమారు రూ.19,917 నుంచి ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: జాబ్ చేస్తున్నారా.. జాగ్రత్త! కియోసాకి హెచ్చరిక బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య YSR మేనత్త కమలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన YS భారతి రెడ్డి

Original source: sakshi.com
Read more on Kaizer News