Shorts Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతూ వచ్చిన పసిడి ధరలు, ఒక్కసారిగా ఊహించని రీతిలో పుంజుకున్నాయి. మొన్నటి వరకు ధరలు కాస్త తగ్గుముఖం పడతాయని ఆశించిన సామాన్యులకు ఇది పెద్ద నిరాశను మిగిల్చింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రకటించిన తర్వాత ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా సీన్ రివర్స్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి అలాగే అమెరికన్ డాలర్ బలపడుతున్న క్రమంలో పసిడి ధరల్లో ఈ భారీ మార్పులు చోటుచేసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా ఎగబాకడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,430 వద్ద ట్రేడవుతుండగా, అత్యంత డిమాండ్ ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,560 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,710 వద్ద విక్రయించబడుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారానికి ఏమాత్రం తీసిపోకుండా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ , చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,55,100 భారీ మార్కు వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2,50,100 పలుకుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.2,50,100 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరల్లో కూడా ఎలాంటి తగ్గుదల లేకపోగా, మరింత స్థిరంగా అధిక ధరల వద్దే కొనసాగుతుండటం విశేషం. పెళ్లిళ్ల సీజన్ లేదా ఇతర అవసరాల కోసం బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ ధరల పెరుగుదల పెద్ద భారంగా మారుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కూడా పసిడి ధరలు ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటే మాత్రం కాస్త గట్టిగానే బడ్జెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది