విపాసన ప్రాచీన ధ్యాన పద్ధతి, మానసిక ప్రశాంతతకి సహాయపడుతుంది. ఆలోచనలు, శరీర అనుభూతులు తీర్పులేకుండా గమనించడం ముఖ్యమైన సాధన. ఒత్తిడి, ఆందోళన తగ్గి ఏకాగ్రత, నిద్ర మెరుగుపడతాయి. Vipassana Benefits : ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ధ్యాన పద్ధతుల్లో విపాసన కూడా ఒకటి. ఇది మనసును బలవంతంగా ఒక ఆలోచనపై కేంద్రీకరించడం కంటే.. మనలో జరుగుతున్న ఆలోచనలు, భావాలు, శరీర అనుభూతులను జడ్జ్ చేయకుండా గమనించడాన్ని నేర్పుతుంది. విపాసన ఒక పురాతన ధ్యాన పద్ధతి. ముందుగా సహజమైన శ్వాసను గమనిస్తూ.. మనసును దానిలో నిమగ్నం చేసుకోవడం నేర్పిస్తారు. ఆ తర్వాత శరీరంలో కలిగే అనుభూతులను ఇష్టం, అయిష్టం లేకుండా గమనించాలి. ఉదాహరణకు.. కూర్చున్నప్పుడు కాళ్లలో నొప్పి వస్తే.. దాన్ని వెంటనే నొప్పి పోవాలి అని కోరుకోవడం లేదా అసహనపడడం కాకుండా.. ఆ అనుభూతిని గమనిస్తూ ఉండటం విపాసన సాధనలో ముఖ్యమైన భాగం. అదే విధంగా మంచి ఆలోచన వచ్చినప్పుడు దానిని పట్టుకుని ఉండకుండా, ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అణచివేయకుండా.. రెండింటినీ గమనించడం విపాసనలో భాగంగా నేర్చుకుంటారు. . మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. నేలపై లేదా కుర్చీలో సౌకర్యంగా కూర్చోవచ్చు. వెన్నెముకను సాధ్యమైనంత నిటారుగా ఉంచి.. శరీరాన్ని బిగించకుండా రిలాక్స్‌గా కూర్చోండి. కళ్లు మూసుకోవచ్చు. నార్మల్‌గా బ్రీత్ తీసుకోండి. శ్వాస లోపలికి వెళ్లడం, బయటకు రావడం గమనించండి. ఆ సమయంలో శరీరంలో కలిగే అనుభూతులను గమనించండి. వేడి, చలి, ఒత్తిడి, దురద, నొప్పి లేదా తేలికపాటి అనుభూతి ఏదైనా వచ్చినా.. వెంటనే స్పందించకుండా గమనించడమే సాధన. మంచి అనుభూతి వచ్చినప్పుడు దానిని మరింత ఎక్కువగా కోరుకోవడం, అసౌకర్యం వచ్చినప్పుడు వెంటనే దాన్ని తొలగించాలని ప్రయత్నించడం కాకుండా.. అది మారుతూ ఉండే అనుభూతి అని గుర్తించాలి. మొదట 5 నిమిషాలతో ప్రారంభించి.. అలవాటు అయిన తర్వాత సమయాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. ఎందుకంటే విపాసనలో కేవలం ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం కాదు.. ఎలా గమనిస్తున్నామన్నదే ముఖ్యం. . యోగా టిప్స్ విపాసనకు సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనలు పరిమితంగా ఉన్నప్పటికీ.. జరిగిన పరిశోధనల్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని తేల్చారు. మన ఆలోచనలు, భావాలను జడ్జ్ చేయకుండా గమనించే సామర్థ్యాన్ని పెరుగుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఎక్కువ. యాంగ్జైటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనలు నిద్ర నాణ్యత మెరుగుపడడాన్ని హైలెట్ చేశాయి. కోపం, ఆందోళన లేదా అసహనం వచ్చిన వెంటనే స్పందించకుండా.. బ్యాలెన్స్గా ఉండడం నేర్పుతుంది. ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంది. అలాగే రోజువారీ జీవితంలో వచ్చే ఎమోషన్స్, ఒత్తిడిని వెంటనే అనుసరించకుండా వాటిని గమనించే అలవాటు పెరుగుతుంది. కొన్ని పరిశోధనల్లో తినే ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. శరీరానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వడం తెలుస్తుంది. విపాసన ఉదయం, సాయంత్రం కూడా చేయవచ్చు