Kaizer News

Bank strike: బిగ్ అలెర్ట్ ..వరుసగా మూడు రోజులు బ్య

Bank strike: బిగ్ అలెర్ట్ ..వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్

· Business · hmtvlive.com

Shorts Bank strike: బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్లు మరోసారి దేశవ్యాప్తంగా సేవలకు ఆటంకం కలిగించేలా కనిపిస్తున్నాయి. వారానికి 5 రోజుల పనిదినాల విధానం, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంక్ యూనియన్లు మరో సమరానికి సిద్ధమయ్యాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతోంది. సెప్టెంబರ್ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయడం, ఖాళీల భర్తీ మరియు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు స్పష్టం చేశాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం సోషల్ మీడియా వేదికగా ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. సమ్మె సమయంలో బ్రాంచ్ సేవలు నిలిచిపోనున్నందున, వినియోగదారులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్రాంచ్‌లలో సేవలు అందకపోవచ్చు. కస్టమర్లు తమ అత్యవసర లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. సమ్మె రోజుల్లో ఇబ్బందులు పడకుండా ఎస్బీఐ సూచించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, YONO యాప్, మొబైల్ బ్యాంకింగ్ , UPI సేవలు యథావిధిగా కొనసాగుతాయి. నగదు అవసరాల కోసం సమీపంలోని ఏటీఎంలు, ఆటోమేటెడ్ క్యాషియర్ మెషిన్లను ఉపయోగించుకోవచ్చు. స్థానికంగా అందుబాటులో ఉండే సీఎస్పీ కేంద్రాలను ఆశ్రయించవచ్చని ఎస్బీఐ సూచించింది.. ఖాతాదారులు ఈ అసౌకర్యాన్ని గమనించి, ముందస్తుగా తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం ఎంతైనా మంచిది. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News