Kaizer News

Moral Story: మనసుకు శాంతి ఎక్కడ దొరుకుతుంది? చిన్న

Moral Story: మనసుకు శాంతి ఎక్కడ దొరుకుతుంది? చిన్న కథలో గొప్ప జీవిత రహస్యం

· Health · tv9telugu.com

పర్వతాల మధ్యలో ఉన్న ఓ అందమైన చిన్న గ్రామంలో మార్కో అనే 24 ఏళ్ల యువకుడు ఉండేవాడు. మార్కోకు అన్నీ ఉన్నా… ఒక్కటి మాత్రం లేదు — మనశ్శాంతి. అతని మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉండేది. ‘గతంలో నేను అలా ఎందుకు చేశాను? రేపు ఏం జరుగుతుంది? నా జీవితం ఎలా మారుతుంది?’ ఇలా గతం గురించి బాధపడుతూ… భవిష్యత్తు గురించి భయపడుతూ… అతని రోజులు గడిచిపోయేవి. ఆలోచనలు అతని మనసులో తుఫానులా తిరుగుతుండేవి. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. పగలు ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోయేవాడు. చివరకు నవ్వడం కూడా మర్చిపోయాడు. ఒకరోజు మార్కోకు ఓ విషయం తెలిసింది. పర్వతాల మధ్య ఉన్న ఓ దూరపు గ్రామంలో ఓ వృద్ధ జ్ఞాని నివసిస్తున్నాడట. ఒకప్పుడు ఆయన నగరంలో ప్రముఖ మనస్తత్వ నిపుణుడిగా పనిచేసేవారట. ఎన్నోమంది తమ సమస్యలతో ఆయనను కలిసేవారు. వారి మనసులోని అలజడిని తొలగించి, ప్రశాంతంగా జీవించడం ఎలాగో ఆయన నేర్పించేవారు. వయసు పెరిగిన తర్వాత నగర జీవితాన్ని వదిలి ప్రకృతికి దగ్గరగా ఉన్న ఆ గ్రామానికి వెళ్లి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈ విషయం విన్న మార్కోలో ఆశ కలిగింది. ‘బహుశా… నా మనసుకు శాంతిని ఇచ్చే మార్గం ఆయన చెప్పగలరేమో!’ అని అనుకున్నాడు. మరుసటి రోజే ఆ వృద్ధుడిని కలవడానికి బయలుదేరాడు. కొన్ని రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మార్కో ఆ గ్రామానికి చేరుకున్నాడు. పచ్చని చెట్ల మధ్య ఓ చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంటి వరండాలో ఓ వృద్ధుడు కళ్లుమూసుకుని ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. మార్కో ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. ‘తాతగారూ… నా మనసు చాలా చంచలంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆలోచనలు ఆగడం లేదు. నాకు ప్రశాంతత కావాలి. మీరు నాకు సహాయం చేయగలరా?’ అని అడిగాడు. వృద్ధుడు నెమ్మదిగా కళ్లుతెరిచి చిరునవ్వు నవ్వాడు. ‘శాంతి కావాలా? తప్పకుండా. కానీ ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి’ అంటూ ఇంట్లోకి వెళ్లి ఓ గ్లాసు తీసుకొచ్చాడు. ఆ గ్లాసును అంచుల వరకు నీటితో నింపాడు. ‘ఇదిగో ఈ గ్లాసును తీసుకో. గ్రామం చివరి వరకు వెళ్లి తిరిగి నా దగ్గరకు రా.. కానీ ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు’ అని అన్నాడు. మార్కోకు ఆ పని చాలా వింతగా అనిపించింది. అయినా వృద్ధుడి మాటను పాటించాలని నిర్ణయించుకున్నాడు. గ్లాసును జాగ్రత్తగా చేతిలో పట్టుకుని నడవడం ప్రారంభించాడు. గ్రామంలోని దారి చాలా రద్దీగా ఉంది. ఎవరో పరుగులు తీస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. దుకాణదారులు కస్టమర్లను పిలుస్తున్నారు. కుక్కలు మొరుగుతున్నాయి. ఎక్కడ చూసినా శబ్దమే. కానీ మార్కో మాత్రం వాటిని ఏమీ పట్టించుకోలేదు. అతని కళ్లంతా గ్లాసుపైనే ఉన్నాయి. ఒక్క అడుగు… మరో అడుగు… చాలా జాగ్రత్తగా నడుస్తూ గ్రామం చివరికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వృద్ధుడి దగ్గరకు వచ్చాడు. గ్లాసును చూపిస్తూ ఆనందంగా అన్నాడు ‘తాతగారూ! నేను చేసేశాను. ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు’. వృద్ధుడు చిరునవ్వు నవ్వి అడిగాడు ‘చాలా మంచిది. కానీ నువ్వు వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన పిల్లలు ఆడుకోవడం చూశావా?’ మార్కో తల ఊపాడు.. ‘లేదు’. ‘మరి అక్కడ మొరుగుతున్న కుక్కలు కనిపించాయా?’. లేదు అన్నాడు. దుకాణాల దగ్గర జరుగుతున్న సందడి చూశావా? ‘లేదు తాతగారూ. నేను గ్లాస

Original source: tv9telugu.com
Read more on Kaizer News