Kaizer News

UPI కొత్త నిబంధనలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి అమలు

UPI కొత్త నిబంధనలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి అమలు

· Business · tv9telugu.com

UPI చెల్లింపులపై NPCI కీలక ప్రకటన విడుదల చేసింది. రూ.2,000 వరకు UPI లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. చిరు వ్యాపారులకు రూ.లక్ష వరకు ఉచితమని తరువాత అధిక విలువ లావాదేవీలపై గరిష్టంగా రూ.300 చార్జీ విధిస్తామని వెల్లడించారు.. రైల్వేలు, ఇంధనరంగాల్లో రూ.2 వేలు దాటితే రూ.500 చార్జీ విధిస్తారు. కొత్త నిబంధనలతో చిరువ్యాపారులకు ఇబ్బంది లేదని NPCI వెల్లడించింది. 95శాతం లావాదేవీల్లో ఎలాంటి చార్జీలు పడవని NPCI స్పష్టం చేసింది. చిరు వ్యాపారుల మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అక్టోబర్ 15 నుంచి UPI కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి . మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు 0.02 శాతం ఎండీఆర్‌ అమలవుతుందని, గరిష్ఠంగా రూ.300 ఉంటుందని తెలిపింది. మొత్తం యూపీఐ పీ2ఎం లావాదేవీల్లో 95 శాతానికి పైగా రూ.2,000 లోపే ఉండటం వల్ల చిన్న వ్యాపారులపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎన్‌పీసీఐ పేర్కొంది. టైర్‌-3, అంతకంటే చిన్న పట్టణాల్లో డిజిటల్‌ చెల్లింపుల మౌలిక వసతుల విస్తరణ, చిన్న వ్యాపారులకు తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వ్యాలెట్లతో పోలిస్తే సవరించిన ఈ యూపీఐ ఎండీఆర్‌ రుసుములు చాలా తక్కువని పేర్కొంది. యూపీఐ యాప్‌లు ప్లాట్‌ఫామ్‌ ఫీజులు, రహస్య ఛార్జీలు విధించకూడదని ఎన్‌పీసీఐ స్పష్టంచేసింది. అయితే UPI లావాదేవీలపై MDR చార్జీలతో ప్రజలపై పెనుభారం మోపారని కాంగ్రెస్‌ నేతలు రాహల్‌,ఖర్గే విమర్శించారు. అమెరికా ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్ ట్వీట్‌ చేశారు. పవన్‌ ఖేరా , కాంగ్రెస్‌ నేత ANI-1_004_1509_PART091 tcr 2.07-2.27. అయితే రాహుల్‌ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. వినియోగదారులపై , చిరువ్యాపారులపై ఎలాంటి అదననపు చార్జీలు ఉండవంటున్నారు బీజేపీ నేతలు. AIకి చెక్‌ పెట్టకపోతే ముప్పు తప్పదన్న నిపుణులు.. ట్రాష్ అంటూ కొట్టిపారేసిన ట్రంప్‌ నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది? 3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!

Original source: tv9telugu.com
Read more on Kaizer News