Kaizer News

కలిసి నడుద్దాం

కలిసి నడుద్దాం

· Health · ntnews.com

ఆరోగ్యానికి నడకకు మించిన వ్యాయామం లేదని అందరికీ తెలిసిందే! కానీ, ఒంటరిగా భారంగా అడుగులు వేసిందానికన్నా, నచ్చిన వారితో జంటగా నడిస్తే మరింత ప్రయోజనం ఉందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు రోజూ ఒంటరిగా వాకింగ్‌ చేసే 141 మందితోపాటు కలిసి నడిచే 72 జంటలనూ పరిశీలించారు. వారితో మాట్లాడారు. ఇందులో తేలిందేమిటంటే, ఒంటరిగా వాకింగ్‌ చేస్తున్నవారి వేగం కంటే జంటగా నడుస్తున్న వారి వేగం తక్కువట. దంపతులు ఊసులు పంచుకుంటూ ఆనందంగా నడవడమే వేగం తగ్గడానికి కారణం. కానీ, ఇలా కబుర్లాడుకుంటూ ఆనందాలు పంచుకోవడం వల్ల వేగం తగ్గినా వారి ఆరోగ్యం హెచ్చుతున్నదని పరిశోధకులు తేల్చారు. “వాకింగ్‌ మాత్రమే కాదు, వ్యాయామం చేసే సమయంలోనూ జీవిత భాగస్వామి గానీ, స్నేహితులు గానీ తోడుంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. వేరే కసరత్తులు సాధ్యపడకపోయినా వారానికి 150 నిమిషాలు జంటగా వాకింగ్‌ చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గుతాయ”ని చెబుతున్నారు పరిశోధకులు

Original source: ntnews.com
Read more on Kaizer News