జుట్టు పలుచబడటానికి ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు కారణాలు. ప్రోటీన్ ఆహారం, ఒత్తిడి తగ్గించుకోవడం జుట్టు ఆరోగ్యానికి అవసరం. అధిక స్టైలింగ్ మానుకొని, సమస్య ఎక్కువైతే నిపుణులను సంప్రదించాలి. Thinning Hair and Excessive Hair Fall : జుట్టు రాలడం మాత్రమే కాదు.. జుట్టు పలుచగా మారడం, స్కాల్ప్ ఎక్కువగా కనిపించడం, జుట్టు గతంలో ఉన్నంత ఒత్తుగా లేకపోవడం కూడా చాలామందిని ఇబ్బంది పెడతాయి. ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, హార్మోన్లలో మార్పులు, హెయిర్ స్టైలింగ్‌లో భాగంగా తరచూ కెమికల్స్, హీట్ ఉపయోగించడం వంటి కారణాలతో జుట్టు నాణ్యత దెబ్బతింటూ ఉంటుంది. జుట్టు పలుచబడుతోందని కనిపించిన ప్రతిసారీ అది పూర్తిగా జుట్టు రాలిపోవడాన్ని సూచించదని నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు జుట్టు విరిగిపోవడం, తాత్కాలికంగా ఎక్కువగా రాలడం లేదా పోషకాహార లోపాలు కూడా జుట్టు పలుచగా కనిపించడానికి కారణం అవుతాయి అంటున్నారు. అందుకే ముందుగా చిట్కాలు ఫాలో అయ్యే ముందు కారణాన్ని గుర్తించడం ముఖ్యమని చెప్తున్నారు. . జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి స్కాల్ప్‌పై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయనేదే హెయిర్ డెన్సిటీని సూచిస్తుంది. డెన్సిటీ తగ్గితే జుట్టు పలుచగా, ఫ్లాట్‌గా కనిపిస్తుంది. అయితే జుట్టు డెన్సిటీ తగ్గడానికి ఒకే ఒక్క కారణం ఉండదు. జుట్టు రాలడం, హెయిర్ బ్రేకేజ్, ఒత్తిడి, పోషకాహార లోపాలు వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడి ఎక్కువకాలం ఉండటం వల్ల కొంతమందిలో జుట్టు రాలడం పెరగవచ్చు. ఇది హెయిర్ షెడ్డింగ్‌కు కారణమవుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండలాంటే శరీరానికి తగినంత ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు వంటి పోషకాలు అవసరం. రోజువారీ ఆహారంలో ఇవి సరిగ్గా అందకపోతే జుట్టు బలహీనంగా మారి రాలడం జరుగుతుంది. నిద్ర అనేది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు.. జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. . ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, పప్పులు, శనగలు, పెరుగు, పాలు, చేపలు లేదా ఇతర ప్రోటీన్ ఆహారాలు డైట్లో చేర్చుకోవచ్చు. జుట్టు పలుచగా మారుతోందని చాలామంది వెంటనే బయోటిన్, ఒమేగా-3 లేదా ఇతర హెయిర్ సప్లిమెంట్స్ తీసేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికీ సప్లిమెంట్స్ అవసరం ఉండదు. పోషక లోపం ఉంటే.. వైద్యుల సూచనతో తగిన సప్లిమెంట్ తీసుకోవడం మంచిది. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, నిద్రలేమి వంటివి మానసిక ఆరోగ్యాన్నే కాదు.. రోజువారీ జీవనశైలిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి యోగ, మెడిటేషన్, వాకింగ్ వంటి ఒత్తిడిని తగ్గించే అలవాట్లు చేసుకోండి. అలాగే స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం, జుట్టు రకానికి సరిపోయే మైల్డ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మంచిది. స్కాల్ప్ మసాజ్ కూడా మంచి ఫలితాలు ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టు పొడిబారడం, బ్రేకేజ్ తగ్గించడంలో కొబ్బరి నూనె హెల్ప్ చేస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు మంచిది. . జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతు