Kaizer News

Egg Freezing For Future Pregnancy : లేట్ ప్రెగ్నెన

Egg Freezing For Future Pregnancy : లేట్ ప్రెగ్నెన్సీ కోసం ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

· Health · telugu.abplive.com

మహిళలు భవిష్యత్తు సంతానం కోసం తమ అండాలను ఫ్రీజ్ చేస్తున్నారు. 30 ఏళ్ల లోపు అండాలు ఫ్రీజ్ చేస్తే నాణ్యత బాగుంటుంది. ఎగ్ ఫ్రీజింగ్ గర్భధారణకు పూర్తి హామీ ఇవ్వదని నిపుణులు తెలిపారు. Freezing Eggs Late Pregnancy : ఈ రోజుల్లో చాలా మంది మహిళలు.. కెరీర్​లో ముందుకు వెళ్తూ.. భవిష్యత్తులో తల్లులు కావాలనుకుంటున్న వారు.. తమ ఎగ్స్​ను ఫ్రీజింగ్ చేసుకోవాలనే ఆలోచనల్లో ఉంటున్నారు. చాలామంది సెలబ్రెటీలు కూడా తమ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. హీరోయిన్స్ మెహ్రీన్, మృణాల్ వంటివారు కూడా దీని గురించి చాలాసార్లు ప్రస్తావించారు. అయితే ఈ ప్రక్రియలో పాల్గొనాలంటే ఏ వయసు మంచిది? ప్రాసెస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూసేద్దాం. ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో మహిళ అండాశయాల నుంచి అండాలను తీసి.. అవసరమైతే తర్వాత ఉపయోగించుకోవడానికి వాటిని భద్రంగా నిల్వ చేస్తారు. ముందుగా టెస్ట్​లు చేసి.. చికిత్స ప్రక్రియ ప్రారంభిస్తారు. ిగే కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత మారుతుంది. సాధారణంగా చిన్న వయసులో సేకరించిన అండాలు మెరుగైన నాణ్యతను కలిగి ఉండవచ్చు. 30 ఏళ్ల వయసులో అండాలను ఫ్రీజ్ చేస్తే మంచి నాణ్యత లభించవచ్చు. అయితే 35 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం ఎక్కువగా వ్యక్తిగత పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఈ ప్రక్రియ సాధ్యం కావచ్చు. కానీ మంచి అండాలు దొరికే అవకాశాలు తక్కువగా ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే అండాలను ఫ్రీజ్ చేయడం అంటే భవిష్యత్తులో సంతానం కలుగుతుందని హామీ ఇవ్వడం కాదంటూ మరో షాకింగ్ విషయం తెలిపారు. ఎందుకంటే అండాలను ఫ్రీజ్ చేసే వయసు వాటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సేకరించిన పరిపక్వ అండాల సంఖ్య కూడా దీనిలో పాత్ర పోషిస్తాయి. అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఐవీఎఫ్, ఎగ్ ఫ్రీజింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. చే ప్రక్రియలో భాగంగా.. అండాశయాలలో అనేక అండాల అభివృద్ధిని ప్రేరేపించడానికి మందులను ఉపయోగిస్తారు. ఈ సమయంలో అండాశయాలు కొద్ది కాలం పాటు ఉబ్బి.. పెళుసుగా మారతాయి. అందువల్ల వేగంగా పరుగెత్తడం, దూకడం, బరువైన వస్తువులను ఎత్తడం లేదా శరీరాన్ని అకస్మాత్తుగా మెలితిప్పాల్సిన వ్యాయామాలు చేయకూడదు. తేలికపాటి నడక, సులభమైన శారీరక వ్యాయామం చేయవచ్చు. కానీ ఇది మహిళల ఆరోగ్యపరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అండాలను సేకరించే సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ ప్రక్రియ తర్వాత వ్యాయామాన్ని ఎప్పుడు తిరిగి ప్రారంభించాలనే దాని గురించి కూడా వైద్యులు వివరంగా సూచించే అవకాశం ఉంది. . గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి. About the author Geddam Vijaya Madhuri విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచే

Original source: telugu.abplive.com
Read more on Kaizer News