Kaizer News

సమపాళ్లలో తీసుకుందాం..

సమపాళ్లలో తీసుకుందాం..

· Health · ntnews.com

మన ఆరోగ్యానికి సమతుల ఆహారమే హామీ ఇస్తుంది. రోజువారీ భోజనంలో అన్నంతోపాటు ఐదు రకాల రంగురంగుల కూరగాయలను సమపాళ్లలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే తినే పళ్లెమే కాకుండా మన జీవితాన్నీ రంగులమయం చేసుకోవచ్చు, ఆరోగ్యంగా బతికేయొచ్చు. రోజూ కాకున్నా.. వారానికి రెండు సార్లు అయినా ఈ డైట్‌ ఫాలో అయితే మేలైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. క్యారెట్లు: 128 గ్రాములు తీసుకోవాలి. వీటిలో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. రోజువారీ అవసరమైన ఎ విటమిన్‌లో 119 శాతం దీన్నుంచి లభిస్తుంది. వీటిలో ఉండే బీటా కెరోటిన్‌ అనే యాంటి ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ నివారణలో దోహదపడుతుంది. పాలకూర: 30 గ్రాములు తీసుకోవాలి. రోజువారీ విటమిన్‌ ఎ అవసరంలో 16 శాతం లభిస్తుంది. విటమిన్‌ కె 120 శాతం అందుతుంది. బ్రకోలి: 91 గ్రాముల బ్రకోలి నుంచి రోజువారీ విటమిన్‌ కె 77 శాతం లభిస్తుంది. విటమిన్‌ సి 90 శాతం అందుతుంది. అదనంగా ఫోలేట్‌, మ్యాంగనీస్‌, పొటాషియం కూడా లభిస్తాయి. పచ్చి బటానీలు: 160 గ్రాముల బటానీల్లో 9 గ్రాముల ఫైబర్‌, 9 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. ఎ, సి, కె విటమిన్లు, రిబోఫ్లెవిన్‌, థయామిన్‌, నియాసిన్‌ లాంటి బి కాంప్లెక్స్‌ విటమిన్లు, ఫొలేట్‌ సమృద్ధిగా ఉంటాయి. కేల్‌: 21 గ్రాముల కేల్‌లో పొటాషియం, క్యాల్షియం, కాపర్‌, ఎ, బి, సి, కె విటమిన్లు అందుతాయి. రక్తంలో చక్కెర స్థాయులు, బీపీ, కొలెస్ట్రాల్‌ స్థాయులను ఇది తగ్గిస్తుంది

Original source: ntnews.com
Read more on Kaizer News