Sugar Price: పండుగల సీజన్ మొదలవుతోందంటే చాలు ఇళ్లలో పిండివంటలు, తీపి పదార్థాల సందడి నెలకుంటుంది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల సమయంలో.. ఆకాశాన్నంటిన పంచదార ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అయితే, పండుగల వేళ సామాన్యుడికి మళ్లీ ఊరట లభించనుంది. గడిచిన మూడు వారాల్లోనే బహిరంగ మార్కెట్‌లో కిలో పంచదార రిటైల్ ధర దాదాపు 10 శాతం మేర తగ్గి, రూ. 65 నుంచి రూ. 58.50 కి దిగివచ్చిన విషయం తెలిసిందే. కేవలం ధరల తగ్గింపే కాకుండా, మార్కెట్లో చక్కెర కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున పంచదారను ఉపయోగించే వ్యాపారులు లేదా పారిశ్రామిక వినియోగదారులు ఇప్పటివరకు కేవలం 15 రోజులకు సరిపడా నిల్వలు (స్టాక్) మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉండగా, ఆ పరిమితిని ప్రభుత్వం ఇప్పుడు 30 రోజులకు పెంచింది