Kaizer News

Healthy Sleep: 8 గంటలు పడుకున్నా అలసటగా ఉందా? ఈ ఒక్క విషయం మిస్ అవుతున్నారేమో!

· Health · tv9telugu.com

రోజుకు 8 గంటలు నిద్రపోతే చాలు.. ఉదయం లేచిన వెంటనే ఫ్రెష్‌గా ఉండొచ్చని చాలామంది అనుకుంటారు. అయితే నిద్ర సమయం మాత్రమే కాదు.. ప్రతిరోజూ ఏ సమయంలో పడుకుంటున్నారు, ఏ సమయంలో మేల్కొంటున్నారు అనేది కూడా శరీరంపై ప్రభావం చూపుతుందని పనితీరు శాస్త్రవేత్త, కోచ్ డాక్టర్ ఆండీ గాల్పిన్ వివరించారు. ఆగస్టు 28న షేర్ చేసిన ఓ పాడ్‌కాస్ట్ క్లిప్‌లో నిద్రకు సంబంధించిన సమస్యల గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వారాంతాల్లో నిద్ర వేళలు గణనీయంగా మారడం వల్ల, తగినంత గంటలు నిద్రపోయినా మరుసటి రోజు అలసట, మత్తు లేదా మెదడు మసకబారినట్టుగా అనిపించవచ్చని తెలిపారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News