Kaizer News

House Construction: 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణా

House Construction: 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? 3 రకాల బడ్జెట్లు మీ కోసం!

· Business · tv9telugu.com

House Construction Cost: మీరు 150 గజాల స్థలంలో కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారా? అయితే, నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంటుంది. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు – ఇలా రకరకాల అంచనాలు వినపడుతుంటాయి. ఈ గందరగోళాన్ని నివారించడానికి, 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి అయ్యే నిజమైన ఖర్చును, అది మీ ఎంపికలను బట్టి ఎలా మారుతుందో తెలుసుకుందాం. అయితే సమాచారం డిల్డర్స్‌, మేస్త్రీలు అందించిన వివరాల ప్రకారం మాత్రమే. మీ ప్రాంతం బట్టి ధరల్లో తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఏరియాను బట్టి ఇసుక, సిమెంట్‌, మేస్త్రీలు, కూలీల ఖర్చు హెచ్చుతగ్గులు ఉంటాయని గుర్తించుకోండి. అయితే ఈ వివరాలు అంచనా మాత్రమేనని గమనించండి. ముందుగా, 150 గజాల స్థలం అంటే ఎంత విస్తీర్ణం వస్తుందో చూద్దాం. ఒక గజం 9 చదరపు అడుగులకు సమానం కాబట్టి, 150 గజాలు అంటే 1350 చదరపు అడుగులు (150x 9 = 1350). ఈ 1350 చదరపు అడుగుల నిర్మాణ ప్రాంతంలో మీరు ఎటువంటి నాణ్యతతో ఇల్లు నిర్మించుకుంటారు అనే దానిపై మొత్తం వ్యయం ఆధారపడి ఉంటుంది. నిర్మాణ నాణ్యత ఆధారంగా మేము మూడు ప్రధాన శ్రేణులను విభజించి, వాటి ఖర్చులను అంచనా వేద్దాం. ఈ వర్గంలో లగ్జరీ కాకుండా, మరీ తక్కువ నాణ్యత కాకుండా, మధ్యస్థాయి మెటీరియల్స్‌తో ఇల్లు నిర్మిస్తారు. సాధారణ అవసరాలను తీర్చే, చూడటానికి చక్కగా ఉండే ఇంటికి ఇది సరైన ఎంపిక. మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఎంపిక. సాధారణ ఇంటి కంటే కొంచెం మెరుగైన నాణ్యతతో, చక్కని ఫినిషింగ్‌తో ఇల్లు కట్టించుకోవాలనుకునే వారికి ఇది అనుకూలం. జీవితంలో ఒక్కసారే ఇల్లు కడతాం కాబట్టి, అత్యుత్తమ నాణ్యతతో, లగ్జరీ సదుపాయాలతో ఇల్లు కావాలనుకునే వారికి ఈ ఎంపిక సరిపోతుంది. పైన పేర్కొన్న అంచనాలు కేవలం నిర్మాణ వ్యయానికి సంబంధించినవి. ఇవి కాకుండా, కొన్ని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి, వీటిని చాలా మంది విస్మరిస్తుంటారు: ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇల్లు కట్టడం ప్రారంభించే ముందే మీ బడ్జెట్ ఎంత, ఎటువంటి నాణ్యతతో ఇల్లు కావాలి అని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ప్రతి దశలోనూ ఖర్చులను అంచనా వేసి, ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే, చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి లేకుండా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు

Original source: tv9telugu.com
Read more on Kaizer News