పిల్లల్లో ఊబకాయం అంటే కేవలం జంక్‌ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం వల్లే వస్తుందని చాలామంది అనుకుంటారు. అయితే చిన్నారుల రోజువారీ జీవనశైలిలో కనిపించే కొన్ని సాధారణ అలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ అంకుర్ చావ్లా పేర్కొన్నారు. ముఖ్యంగా చక్కెర కలిగిన పానీయాలు, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం, భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ ఉపయోగించడం, శారీరక కదలికలు తగ్గిపోవడం, నిద్ర వేళల్లో మార్పులు వంటి అంశాలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని ఆయన వివరించారు