Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.! సాధారణంగా వచ్చే నోటిపుండ్లు.. రెండు వారాలు దాటినా పుండు తగ్గకపోతే.. డెంటిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది. Follow Us : --> Add as a preferred source on google Mouth Ulcer: నోటిలో పుండ్లు రావడం చాలా సాధారణం. పొరపాటున చెంప లేదా నాలుకను కొరుక్కోవడం, మరీ వేడిగా ఉన్న ఆహారం తినడం, ఒత్తిడి, పోషకాహార లోపాలు వంటి కారణాలతో నోటిపుండ్లు ఏర్పడవచ్చు. సాధారణంగా ఇలాంటి పుండ్లు ఒకటి లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే పుండు ఎంతకీ తగ్గకుండా అలాగే ఉంటే మాత్రం దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఒకే ప్రదేశంలో పదేపదే పుండు రావడం, పుండు పరిమాణం పెరగడం లేదా నోటిలో ఇతర మార్పులు కనిపించడం వంటివి ఉంటే కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించడం మంచిది. ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్స్‌కు చెందిన హెడ్ అండ్ నెక్ సర్జరీ, ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ నారాయణ సుబ్రమణ్యం ప్రకారం.. గాయం, ఒత్తిడి, నాలుకను కొరుక్కోవడం, పోషకాహార లోపాలు వంటి కారణాలతో సాధారణ నోటిపుండ్లు ఏర్పడవచ్చు. ఇవి సాధారణంగా ఒకటి నుంచి రెండు వారాల్లో తగ్గిపోతాయి. అయితే పుండు ఆ సమయంలో తగ్గకుండా కొనసాగితే మాత్రం కేవలం మార్కెట్‌లో లభించే జెల్స్ రాసుకుంటూ ఉండకుండా, అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. నోటిలో పుండు ఎక్కువకాలం తగ్గకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఐరన్ లోపం, విటమిన్ బి12 లేదా ఫోలేట్ లోపం, జీర్ణాశయ సంబంధిత సమస్యలు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, కొన్ని మందుల ప్రభావం వంటివి కారణాలు కావచ్చు. అలాగే పదునైన పంటి అంచు, సరిగా ఉండని డెంటల్ ఫిల్లింగ్ లేదా డెంచర్ కారణంగా ఒకే ప్రాంతంలో పదేపదే రాపిడి ఏర్పడటం వల్ల కూడా పుండు మానకుండా ఉండొచ్చు. నోటిపుండు ఎన్ని రోజులు ఉంటుందనేది ముఖ్యమైన సంకేతం. సాధారణంగా రెండు నుంచి మూడు వారాల కంటే ఎక్కువకాలం నోటిపుండు తగ్గకుండా ఉంటే దాన్ని డెంటిస్ట్ లేదా వైద్యుడికి చూపించాలి. పుండు క్రమంగా పెద్దదవడం, సులభంగా రక్తస్రావం కావడం, పుండు అంచులు గట్టిగా లేదా మందంగా మారడం వంటి మార్పులు కనిపిస్తే మరింత జాగ్రత్త అవసరం. అదే సమయంలో మెడలో గడ్డలు లేదా వాపు, మింగడంలో ఇబ్బంది, నాలుకను కదిలించడంలో సమస్య, కారణం తెలియకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వైద్య పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే ఎక్కువకాలం ఉండే ప్రతి నోటిపుండు క్యాన్సర్ అని అర్థం కాదు. కొన్ని నోటి క్యాన్సర్ల ప్రారంభ దశలో కూడా సాధారణ పుండులా కనిపించే అవకాశం ఉండటంతో, పుండు ఎంతకాలం ఉంటోంది, దానిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయనే విషయాలను గమనించడం ముఖ్యం. ఒకే ప్రదేశంలో పదేపదే నోటిపుండు రావడానికి సాధారణ కారణం కూడా ఉండొచ్చు. ఉదాహరణకు పదునైన పంటి అంచు, డెంటల్ ఫిల్లింగ్ లేదా డెంచర్ కారణంగా అదే ప్రాంతంలో నిరంతరం రాపిడి ఏర్పడితే పుండు మానడానికి అవకాశం ఉండదు. నిపుణల ప్రకారం.. మానని పుండ్లు, ఒకే చోట పదేపదే వచ్చే పుండ్లు లేదా నోటిలో ఇతర మార్పులతో కలిసి కనిపించే పుండ్లను నిర్లక్ష్యం చేయకూడదు. నోటిపుండు